హోమ్

దేవ ప్రశ్న  అనేది చాలా విశిష్ట మయిన ప్రశ్న పద్దతి . ఈ దేవ ప్రశ్నలో మనం  మమూలుగా జాతకంలో తెలియని చాలా విషయాలు తెలుసుకోవచ్చు.  మనకు  జాతకంలో మన గురించి కొన్ని విషయాలు  మాత్రమే తెలుస్తాయి  కాని దేవ ప్రశ్నలో జాతకంలో తెలియని చాలా విషయాలు తెలుస్తాయి.  మనకు జాతకంలో కొన్ని  దశలు,   విదశలను  అనుసరించి, గోచారం నుంచి కొన్నివిషయాలు తెలుస్తాయి.  ఉదాహరణకి  నర దృష్టి ,  భూతాల వల్ల బాధలు, కొన్ని రకాల శాపాలు, గత జన్మల్లో దోషాలు లేదా శాపాలు జాతకంలో తెలియవు. జాతకంలో అన్నీ బాగున్నా ఏదో ఒక సమస్య వేధిస్తూ  వుంటుంది.  నవగ్రహ జపాలు, పూజలు చేసినా ఫలితం రాదు.  ఇటువంటి సమస్యలకి తగిన పరిహారం దేవ ప్రశ్న చెబుతుంది.