మా గురించి

దేవప్రశ్న అనేది ఒక విశిష్ట పద్ధతి. ఒక వ్యక్తి ఎదుర్కునే సమస్యల్ని తెలుసుకుని, విశ్లేషించి, పరిష్కరించేదే ఈ దేవప్రశ్న. శ్రీ బొమ్మకంటి త్రినాథ కుమార శర్మ గారు మన ప్రాచీన మహర్షులు, జ్యోతిష శాస్త్ర కర్తలు ప్రసాదించిన మహత్తర జ్యోతిష విజ్ఞానం ఆధారంగా ఈ దేవప్రశ్న విధానాన్ని రూపొందించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రులే  అయినా  శ్రీ త్రినాథ కుమార శర్మ గారు జ్యోతిష శాస్త్ర అధ్యయనం వైపు దృష్టి సారించి ఆ శాస్త్రంలోనూ స్నాతకోత్తర పట్టభద్రులయ్యారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీ త్రినాథ కుమార శర్మ గారు  కులక్రమాగతమైన మంత్ర శాస్త్రంలోనూ శిక్షణ పొంది, కష్ట సాధ్యమైన మంత్ర. ధ్యాన, ఆధ్యాత్మిక సాధనలలో సిద్ధిని సాధించుకున్నారు. శ్రీ త్రినాథ కుమార శర్మగారు జ్యోతిష శాస్త్రాన్ని మన పూర్వ కర్మలు, వర్తమానం పైన,  భవిష్యత్తు మీద వాటి ప్రభావాలని వివరించే శాస్త్రంగా భావిస్తారు. ఈ మూడు అంశాల పైన శ్రీ త్రినాథ కుమార శర్మగారు చేసిన అవిశ్రాంత పరిశోధన ఫలితంగా వేలాదిమంది తమ సమస్యల నించి విముక్తిని పొందారు. జ్యోతిష శాస్త్రంలో శ్రీ త్రినాధ కుమార శర్మగారు చేసిన నిర్విరామ పరిశోధనల ఫలితంగా ఈ విశిష్టమైన దేవప్రశ్న విధానం రూపొందింది.