దేవ ప్రశ్న

అసలు దేవ ప్రశ్న ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి,   దీనికి ప్రత్యేకమైన  పద్ధతి ఏమైనా  వుందా అనేది  చూద్దాం.

దేవ ప్రశ్న వేయడం అనేది మామూలుగా జ్యోతిష్య శాస్త్రములో తత్కాల ప్రశ్న చెప్పినట్టుగా  చెప్పడం కాదు.  గురుపరంపరానుగతంగా మంత్ర శాస్త్రాన్ని ఉపాసన చేసి, దేవతలను ప్రసన్నం చేసుకోవాలి,  ఆ తరువాత మాత్రమే ఎదుటి వారి కర్మను తొలగించే శక్తి ఉపాసకుడికి  వస్తుంది.   జ్యోతిష్య శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, శకున శాస్త్రం నేర్చుకుని, మంత్ర సిద్ధిని  పొందినవాడు మాత్రమే  దేవ ప్రశ్న చెప్పడానికి అర్హుడు అవుతాడు .

ఈ దేవ ప్రశ్నలో  మరొక  విశేషం ఏమిటంటే  జాతకం  లేని వారికి కూడా ఇది చెప్పవచ్చు. అంతే కాకుండా కుటుంబంలో అందరికీ కలిపి ఒకే ప్రశ్నలో చూడవచ్చు, దానిలో వచ్చిన ఫలితాన్నిబట్టి  ఎవరికే ఇబ్బంది వుందని  వస్తే వారి జాతకం కూడా పరిశీలన చేసి తగిన పరిహారాలు చేయవచ్చు  

దేవ ప్రశ్నను   మా వద్ద కాని, మీ ఇంట్లో కాని వేయవచ్చు .  దీని కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించి,  తరువాత  దేవ ప్రశ్న నిర్వహించాలి .  ముందుగా గణపతి పూజ, నవ గ్రహ పూజ,   దక్షిణామూర్తి పూజ,  అభిషేకం... ఇంతే కాకుండా ఆ ఇంటి పరిస్థితిని  బట్టి   అవసరమైతే  వాస్తు పూజ, హోమం కూడా చేయవలసి వుంటుంది..  తరువాత దేవ ప్రశ్నలో వచ్చిన సమాధానాలను  అనుసరించి కొన్ని పరిహారాలు వెంటనే చేయవచ్చు.  కొన్ని పరిహారాలు తరువాత చెయ్యవలిసి వుంటుంది. ఈ పరిహరాల్లొ కొన్ని మీరు స్వయంగా చేసుకొనేవి కాగా  కొన్ని నిష్ణాతులు అయిన  బ్రాహ్మణుల చేత  చేయిoచుకోవలసి  వుంటుంది.

 దేవ ప్రశ్నను  1. వ్యక్తిగత జాతకం,  2. కుటుంబములో అందరికోసం 3.  తరుచూ  ఉద్యోగo లో  గొడవలు  4. పిల్లల చదువు  5. పిల్లల వివాహం  6. ప్రక్క ఇంటివారితో లేదా బంధువులతో గొడవలు 7. ఇంట్లో అశాంతి 8.  కోర్టు కేసులు  9. ఇల్లు లేదా స్థలం కొనడం  లేదా అమ్మడం జరగనప్పుడు   10. ఒక వ్యాపార సంస్థ కోసం  11.ఒక  ఫ్యాక్టరీ లేదా కంపెనీ కోసం  12. దేవాలయం  కోసం....   ఇంకా చాల విషయాల కోసం దేవ ప్రశ్న వేయ వచ్చు.