గురుపరంపర

సదాశివ సమరంభాం వ్యాస శంకర మధ్యమాం 
అస్మత్ ఆచార్య పర్యంతాం వందే గురు పరమ్పరామ్
సకల విద్యలకి అధిపతి  అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి నుంచి నా గురుదేవులు అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను.  
జ్యోతిష శాస్త్రం 
మా తండ్రి గారు బ్రహ్మశ్రీ బొమ్మకంటి సుబ్బారావు గారు
వీరే నాకు జ్యోతిషం, ముహుర్తభాగం,  వాస్తు శాస్త్రం నేర్పారు. శివ పంచాక్షరీ మహా మంత్ర   దీక్షని ప్రసాదించి, పాశుపత ప్రయోగాలు, వైదిక విద్యలలో శిక్షణ ఇచ్చారు.

శ్రీ విద్య 
నా పరమ గురువులు అయిన  బ్రహ్మశ్రీ కొడుకుల సూర్యనారాయణ గారు 
వీరు 1949 నుంచి 2005 వరుకు శ్రీచక్ర నవావరణ అర్చన చేసారు. బాలాత్రిపురసుందరి మేరువును జగద్గురు శ్రీ  కళ్యాణానంద భారతి స్వామివారి వద్దనుంచి పొంది, ఆ మేరువును  వీరు పూజించిన దేవతార్చనను    2005వ సంవత్సరములో నాకు  అనుగ్రహించారు.  శ్రీవిద్య రహస్యాలు, వనదుర్గా మహావిద్యా  రహస్యాలు వేరే నాకు ప్రసాదించారు. 

నా స్వగురువులు బ్రహ్మశ్రీ అప్పల వేంకటరామం  గారు
వీరు 1970 నుంచి 2012 వరుకు శ్రీచక్ర నవావరణ అర్చన చేసారు. ప్రస్తుతము వయో భారము తో జపదీక్షలో కాలము గడుపుతున్నారు  
వీరు 1995 లో శ్రీవిద్య  పూర్ణ దీక్ష ప్రసాదించటంతో పాటుగా శ్రీవిద్య కు అంగ విద్యలైన   చండీ సప్తశతి, వనదుర్గా  మహావిద్య,  ప్రత్యంగిరా విద్య,  శ్రీచక్ర నవావరణ అర్చనా విధానాలు నాకు అనుగ్రహించారు.
తంత్ర శాస్త్ర  గురువులు   బ్రహ్మశ్రీ  అనిల్ కుమార్ జోషి గారు
వీరు శ్రీ నారాయణదత్ శ్రీమాలీ  గారి ప్రియ శిష్యులు.  దశ మహావిద్యలు సిద్ది పొందిన  మహనీయులు.   వీరివద్ద  దశమహావిద్యా రహస్యాలు, కార్తవీర్యార్జున, కాలభైరవ సాధనలు, వాటిలో మెళకువలు నేర్చుకున్నాను.
శ్రీ వడ్లమూడి మదన్ మోహన్ రావు గారు.  
వీరు పూర్ణ దీక్షా పరులు.  వీరు బ్రహ్మశ్రీ వడ్లమూడి వేంకటేశ్వరరావు గారి కుమారుడు.   బ్రహ్మశ్రీ వడ్లమూడి వేంకటేశ్వరరావు సుప్రసిద్ధులు. వనదుర్గ, శ్రీచక్ర నవావరణ పూజ విధానాలను అనేక గ్రంథాలను వ్రాసినారు.   వీరు నాకు అనేక సాధనా రహస్యాలని  బోధించారు.