గరుడ పంచమి – కాలసర్పదోష నివారణ

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:42

కాలసర్పదోషానికి పూజలు చేసిన ఫలితం రాలేదా? అయితే గరుడ మంత్రం ఉపాసన చెయ్యండి.

చాలామంది కాలసర్ప దోషం పూజలు చేయించుకుంటారు.  కాళహస్తి, నాసిక్ , రామేశ్వరం, కుక్కి సుబ్రహ్మణ్యంలో పూజలు చేసిన ఫలితం రాకపోతే ఏమిచేయాలి అనేది వివరంగా పరిశీలన చేద్దాం.  మొదట కాలసర్పదోషం ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.  విద్య, ఉద్యోగం, సంతానం, ఆరోగ్యం, వృత్తి వ్యాపారాలు, దాంపత్య జీవితం ఇలా చాలా వాటిమీద ప్రభావం చూపుతుంది.
ఈరోజుల్లో సంతానం కలగపోవడం అనేది సాధారణం అయిపొయింది.  చాలామంది IVF లేదా సరోగ్రస్సి కి వెళ్ళవలసి వస్తోంది.  వీటికి కారణం చాలావరకు కాలసర్పదోష ప్రభావం లేదా సర్పదోషం  అని చెప్పవచ్చు.  ఇంకా చాలా రకాలైన దోషాలు వున్నా  కాలసర్పదోషం చాలా ముఖ్యమైనది.

గర్భాశయంలో చిన్న కంతులు,  గర్భాశయంలో పుండు (అల్సర్), ట్యూబ్ ల్లో  గర్భం రావడం లాంటి సమస్యలు, గర్భధారణ జరిగిన తరువాత ఆరోగ్య సమస్యలు, చాలామందికి పాములు కలలో రావడము, చర్మ సంబంధ వ్యాధులు, కన్ను-చెవి సమస్యలు  ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి.  పూజలు చేసినా  ఫలితం రానపుడు ఏమి చెయ్యాలి? మనం చేసే పూజాపద్దతి తప్పా? ఇంకా ఏమైనా పూజలు చెయ్యాలా?
వివరంగా పరిశీలిద్దాం.  పూజ, జపం, హోమం వీటిల్లో ఏది చేసినా  మంత్రశాస్త్రం ప్రకారం చెప్పాలంటే  మంత్రం ప్రయోగం చేసాము అనిచెప్పాలి.  పౌరాణిక సినిమాల్లో చూస్తే అస్త్ర ప్రయోగాలు చూస్తే  ఒకరు ఆగ్నేయాస్త్రం ప్రయోగం చేస్తే మరొకరు వారుణాస్త్రం ప్రయోగం చేస్తారు.  అంటే ఒక శక్తి  ప్రయోగం జరిగినప్పుడు దాన్ని ఆపడానికి వ్యతిరేకం అయిన శక్తిని ప్రయోగం చేస్తారు.
కాలసర్పదోషానికి పూజ లేదా హోమం లాంటి శాంతి ప్రక్రియ చేసిన తరువాత సర్పదేవత మంత్రం జపం ఎవరికి వారు రోజూ చేసుకోవాలి.  దోషం ఉంటే శాంతి ప్రక్రియ వల్ల తగ్గుతుంది.  కాని సర్పశాపం ఉంటే  సర్పశాంతి వల్ల ఒక్కొక్కసారి పూర్తి ఫలితం రాదు. సర్ప శాపానికి సర్పబలి సంస్కారం చేయాలి.  కాలసర్పదోషపూజ  చేసిన తరువాత గర్భం వచినప్పుడు కొంతమందికి పాములు కలలోకి వస్తూ ఉంటాయి.  దోషనివరణ జరిగితే ఇలా ఎందుకు జరుగుతుంది. ఇలా ఒక్కొక్క దోషానికి ఒక్కొక్క రకమైన పూజ అంటే కష్టం కదా.  
ఇలాంటప్పుడు  సర్పశక్తికి  వ్యతిరేకం గరుడశక్తిని  ఉపాసన చెయ్యాలి.  ఈ గరుడ మంత్రాన్ని ఎవరు ఉపాసన చెయ్యాలి?  అసలు గరుడ మంత్రాలు ఎన్ని రకాలు?
 విషాహారం(Food  Posining), మందులు రియాక్షన్ జరిగినప్పుడు, తరుచూ పాములు కలలోకి వస్తున్నప్పుడు, చర్మవ్యాధులు వచ్చినప్పుడు (సోరియాసిస్),  చెవిలో చీము కారుతున్నప్పుడు, వినికిడి సమస్యలు ఉన్నప్పుడు, సుఖవ్యాధులు,  అకస్మాత్తుగా నపుంసకత్వం కలిగినప్పుడు, తరుచూ జ్వరాల బారిన పడుతున్నప్పుడు, శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, T.B. వచ్చినప్పుడు, ఇల్లు కట్టే స్థలంలో పాము పుట్ట ఉన్నప్పుడు, ఇంట్లో ఎప్పుడూ ఎవరోఒకరు అనారోగ్యం బారిన పడుతున్నప్పుడు  గరుడ ఉపాసన చెయ్యాలి.
గరుడ మంత్రాలలో గరుడ మంత్రం, అసుగరుడమంత్రం, గరుడవ్యూహమంత్రం, అమృత గరుడ మంత్రం, విష్ణు వాహన గరుడ మంత్రం, గరుడమాలమంత్రం ఇలా చాల మంత్రాలు ఉంటాయి.  సమస్యను బట్టి ఏ మంత్రం జపం చెయ్యాలో నిర్ణయం చేసుకోవాలి.

శ్రావణ శుక్ల పంచమి గరుడపంచమి . ఆ రోజు గరుడ పంచమి వ్రతం చేస్తే మంచిది.  కాని ఆ వ్రతాన్ని 10 సంవత్సాలు చెయ్యాలి.  అది కష్టం కనుక ఆ రోజు గరుడ మంత్రాన్ని ఉపాసన ప్రారంభం చేస్తే మంచిది.  మీ జాతకం పరిశీలన చేయించుకొని అవసరం అయితే ఏరకమైన  గరుడ మంత్రం జపం లేదా హోమం చేసుకోవాలో నిర్ణయం చేసుకోండి.


ఓం తత్సత్

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.