గరుడ పూజ

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:43

garuda

శ్రావణ శుక్ల పంచమి గరుడపంచమి (19-08-2015).   కాలసర్పదోషం  లేదా సర్పదోషం కలవారు, సతానపరంగా చిక్కులు వున్నవారు, ఆరోగ్యసమస్యలు, ఇంకా ఇంతకు ముందు రాసిన గరుడపంచమి – కలసర్పదోషంనందు  ఉదహరించిన సమస్యలు ఉన్నవారు ఈ గరుడ పూజ చేసికోవచ్చు.
పూజ విధానం:  గణపతిపూజ చేసికొని సంకల్పంలో మీ సమస్యను సంకల్పంలో చెప్పుకోవాలి. ఒక తెల్లని తువ్వాలు మీద బియ్యం పోసి (7 గ్లాసులు ) మధ్యలో కలశం పెట్టుకోవాలి. కలశంలో లక్ష్మినారాయణులును గరుడునితోసహా ఆవాహన చేసుకోవాలి.  ఆ కలశానికి 8 దిక్కులలలో అష్టనాగులును ఆవాహన చేసుకోవాలి. 

(గరుడుడు అష్ట నాగాలంకర భూషితుడు )
తూర్పునుంచి 1. అనంతుడు 2.వాసుకి 3. తక్షకుడు 4. కర్కోటకుడు 5. పద్ముడు 6. మహాపద్ముడు 7.శంఖపాలుడు 8.కులికుడు వీరిన తూర్పు నుంచి వరుసగా ఈశాన్యం వరుకు ఆవాహన చేయాలి.  తరువాత వరుసగా ఇంద్రాది దిక్పాలకులును వారి అయుదాలతోసహా ఆవాహన చెయ్యాలి.  పురుషసూక్త విధానంగా పూజ చేయాలి. విష్ణుసహస్ర నామాలతో పూజ చెయ్యాలి. గరుడుని 12 నామాలతో అర్చించాలి . 1.సుపర్ణాయనమః   2. వైనతేయాయనమః 3. నాగరినేనమః 4.నాగభూషణాయనమః 5. జైవాతృకాయనమః  6.విషారినేనమః 7.అజితాయనమః 8.విశ్వరూపిణెనమః 9.గరుత్మన్తాయనమః   10. ఖగశ్రేష్టాయనమః 11.తార్క్ష్యాయనమః  12. కశ్యప నందనాయనమః .  ఈ 12 నామాలతో అర్చన చేసిన తరువాత ఆవుపాలు, బియ్యం, బెల్లంతో  చేసిన పాయసం నివేదన చేసి ఆ ప్రసాదం తీసుకొని కలశంలోని నీటిని మరునాడు స్నానం చెయ్యాలి          
పూజ చేసే వారు భుజం మీద కాకుండా వీపు మీద వస్త్రాన్ని కప్పుకోవాలి.   

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.