పరిహారాలు

సాధారణంగా మనకు తెలిసిన పరిహారాలు కొన్ని......
1.గణపతి హోమం, గణపతి తర్పణములు   (విఘ్నాలు తొలగడానికి)
2. సుదర్శన హోమం (శత్రు బాధలు తొలగడానికి )
3. ప్రత్యంగిరా హోమం  (శత్రు బాధలు తొలగడానికి )
4. చండీ హోమం    ( కార్య సిద్ధి కి )
5. లక్ష్మీ  హోమం ( ఐశ్వర్యానికి )
 ఈ విధంగా  చాలా హోమాలు వుంటాయి.    కానీ దేవప్రశ్నలో  ఇటువంటి సాధారణమైన పరిహారాలతో బాటుగా  విశేషమైన పరిహారాలు కూడా ఉంటాయి.  
1. అఘోర శాంతి
2. ఖడ్గ రావణ శాంతి 
3. సర్ప శాంతి
4. వాస్తు   శాంతి
5. శూలినీ దుర్గా మంత్రాలతో  దృష్టి తీయడం 
6. అఘోర పాశుపతం ప్రయోగం 
7. నవగ్రహ పాశుపత ప్రయోగం 
8. వనదుర్గా మంత్రాలతో దిగ్భంధనం   
9. ప్రత్యంగిరా మంత్రాలతో శత్రు బాధా నివారణం 
10 పితృ దోష నివారణం 

ఈ విధంగా చాలా పరిహారాలు వుంటాయి.  ఇవి మాత్రమే కాకుండా మనకు టి.వి. ల్లో  చెప్పినట్టుగా  ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడిని పూజ చేయమని కాకుండా,   మీరు జీవితాతం ఎవరిని పూజించాలి, మీరు గత జన్మల్లో ఎవరికి పూజలు చేశారు, ఎలా చేశారు,  ఇప్పుడు ఎలా చెయ్యాలి వంటివన్నీ ఈ దేవ ప్రశ్నలో చెప్పబడతాయి.