పూర్వజన్మ- పునర్జన్మ (మొదటి భాగం)

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 06:59

చాలామంది మిత్రుల కోర్కెపై వారి ఇంటివద్ద గతకొన్నిరోజులగా దేవప్రశ్న నిర్వహించడం జరిగింది. ఆయా సందర్భాల్లో చాలా ఆశ్చర్యకరమైన సమాధానాలు పొందడం జరిగింది. గతజన్మ కర్మ ఈ జన్మల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనే విషయం పాఠకుల సౌకర్యార్ధం ఇక్కడ పొందుపరచడం జరుగుతోంది. అలాగే కొన్ని అర్ధంకాని,సమాధానం చెప్పలేని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ పూర్వజన్మ-పునర్జన్మ.

ప్రపంచంలో చాలామంది జాతి , కుల, మత, సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా పునర్జన్మను నమ్ముతారు. ఇప్పుడు జన్మించినవారు ఒకప్పుడు మరణిస్తేనే ఇప్పుడు జన్మించడము వీలు అవుతుంది. దీన్నే మనం పునర్జన్మ అంటున్నాం.

ఈ పునర్జన్మ విషయంలో చాలామంది మిత్రులకి కలిగిన సందేహాలు ఇలా ఉన్నాయి.

మరణించినవారు వెంఠనే మరల జన్మను పొందుతారా? కొంత విరామం ఉంటుందా? ఈ విరామంలో ఏమి జరుగుతుంది? ఈ విరామంలో స్వర్గంలో సుఖాలు లేదా నరకంలో శిక్షలు అనుభవిస్తారా? స్వర్గసుఖాలు లేదా నరకలో శిక్ష అనుభవించిన తరువాత వారికి గతజన్మల కర్మ శేషం ఏమీ ఉండదా? ఇంకా కర్మశేషం ఉంటే ఎలా తెలుస్తుంది? కొంతమంది గతజన్మ విశేషాలు చెప్తూ ఉంటారు. వాటిల్లో కొన్ని యదార్ధాలు ఉంటాయి. ఇది ఎలా సాధ్యం? గతజన్మ స్మృతులు కొంతమందికే ఎందుకు ఉంటాయి? అందరికి ఎందుకు ఉండవు? పూర్వజన్మ వాస్తవం అనుకుంటే దాని గురించి తెలుసుకోవచ్చా? గతజన్మల్లో తప్పులు ఏమైనా చేసి ఉంటే వాటి ప్రభావం ఈ జన్మలో ఎలా వుంటుంది? గతజన్మల్లో తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే వాటి ప్రభావం ఎప్పుడు చూపుతాయి ? అలాంటి ప్రభావాలు ముందుగా తెలుసుకొనే అవకాశం ఉందా? అలా తెలుసుకొనే అవకాశం ఉంటే ఆ ప్రభావం తప్పించు కోవచ్చా? పై విషయాలని జాతకం చెప్పగలుగుతుందా? జాతకచక్రం చెప్పే విశేషాలకు పరిమితి ఉందా? ఒకవేళ పరిమితి ఉంటే మిగిలిన విశేషాలు ఎలా తెలుసుకోవాలి?

కొన్ని కారణం లేని అర్ధంకాని ప్రశ్నలు:

కొంతమంది తల్లి-తండ్రులు తమకి పుట్టిన పిల్లలు అందరిమీద ప్రేమ ఒకే రకంగా చూపలేరు. ఎందుకు? పిల్లవాడికి మంచి చదువు వుంది, కాని సరైన ఉద్యోగం రావట్లేదు. ఎందుకు? ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి చదువు, రూపం, కుటుంబ నేపధ్యంలో ఎలాంటి లోపం లేదు. కానీ వివాహం కావట్లేదు. కారణం ఏమిటి? కోర్టులో సాక్ష్యాలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి కానీ కేసు ఒడి పోయాము. ఎందుకు? పైన చెప్పిన సమస్యలకి చాలామంది ఎవరు ఏమి సలహా చెబితే ఆ రకమైన పూజలు పరిహారాలు చేసినా సరైన ఫలితం పొందట్లేదు. ఎందుకు ? పై ప్రశ్నలకు సాధారణ జాతకం సమాధానం చెప్పలేదు. ప్రత్యేకమైన ప్రశ్న పద్దతులద్వారా అంటే పూర్వజన్మల కర్మల విశ్లేషణ ద్వారా సరైన సమాధానాలు తగిన పరిహారాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి చాలాప్రశ్నలకి సమాధానం చెప్పేదే దేవప్రశ్న.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.