కర్మఫలం:
“అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కృత కర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి"
చేసిన కర్మ మంచిదైనా,చెడ్డదైనా దాని ఫలం అనుభివించక తప్పదు. ఆ కర్మఫలం ఒక కల్పకాలం అయినా మనకోసం కాచుకుని ఉంటుంది.
“యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పూర్వ కృతం కర్మ కర్తార మను గచ్ఛతి " అనగా వేల సంఖ్యలో ఉన్న ఆవుల్లో సైతం లేగదూడ తన తల్లిని ఏవిధంగా వెదకి పట్టు కుంటుందో అలాగే గతంలో చేయబడిన కర్మలు ఆ కర్తను అనుసరిస్తూ ఉంటాయి.
మనం గమనించవలిసిన ముఖ్య విషయం,పూర్వజన్మకర్మ వల్ల బాధపడుతున్నామని ఎలా గుర్తించాలి. సాధారణంగా చాలామందికి పూర్వజన్మల్లోని కర్మలు తమని వెంటాడుతున్నాయి అని ఒప్పుకోవడానికి మనస్కరించదు . తమ కష్టానికి ప్రక్క వారు కారణం అనుకుంటారు. మనలని బాధపెట్టాలని ప్రక్కవారికి ఎందుకు ఉంటుంది అని ఆలోచించరు. దీనికి కూడా కారణం
గతజన్మలలోని కర్మలే. ఆశ్చర్యంగా ఉందికదా!
ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఈ మధ్య facebook లో ఒక పోస్ట్ లో ఒక కుక్క(pitbull) దాని యజమాని తల కొరికి చంపడం మనలో చాలామంది చూసి ఉంటారు. అతడు ఆ కుక్కని చాలా డబ్బు ఖర్చు పెట్టి కొన్నాడు. కర్మానుసారం అతడి మృత్యువు కుక్కరూపంలో ఉంది.(జాతకంద్వారా లేదా ప్రశ్న ద్వారా కొన్ని ప్రత్యేక సూత్రాలద్వారా మరణం గురుంచి తెలుసుకోవచ్చు) . అతడి చాలా డబ్బు ఖర్చు చేసి తన మృత్యువుని తానే కొని తెచ్చుకున్నాడు అని చెప్పవచ్చు. మరొక ఉదాహరణ ,దారిలో వేడుతున్న ఒక మనిషిని ఎప్పుడూ ఎవరని ఏమి చేయని ఒక కుక్క కరిచింది అనుకొంటే అదే పూర్వజన్మ కర్మ అని చెప్పవచ్చు. ఎలా? ఆ కుక్కని గతజన్మల్లో ఎప్పుడో ఆ మనిషి కొట్టి ఉంటాడు. కర్మ అనుభవంలోకి వచ్చే సమయం లో కుక్కకాటుకి గురి అయ్యాడు అని చెప్పవచ్చు. ఇలా గతజన్మ కర్మ అనుకోకుండా లేదా కొన్ని సార్లు కొనితెచ్చుకుని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది.
ఇలా అనుకోకుండా వచ్చే సమస్యలు(ఆర్ధిక, ఆరోగ్య,మానసిక, ఉద్యోగ-వ్యాపారం మొ.వి.) ముందే తెలుసుకోవచ్చా అని చాలామందికి సందేహం కలుగుతుంది. అవి ఎలాగో తరువాత భాగంలో చూద్దాం.
Add new comment